Ravindra Jadeja: మరో 9వ రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ కోసం ఇప్పటికే అన్ని జట్లు ముమ్మరంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాయి. ఆటగాళ్లు మ్యాచ్‌కు సిద్ధం కావడానికి ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో సూర్యవంశీ తన పటిష్టమై బ్యాటింగ్ తో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా వేసిన బంతులను మైదానంలోని పలు దిశలకు హిటింగ్ చేస్తూ కనిపించాడు.
దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రాక్టీస్ సమయంలో యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ నెట్స్‌లో బౌండరీలు కొట్టడం చూసిన రవీంద్ర జడేజా ఇచ్చిన రియాక్షన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్ క్రికెటర్ ఇలా బ్యాటింగ్ చేస్తుండగా, కెమెరాలు జడేజా ఎక్స్‌ప్రెషన్ కవర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఈ సీజన్ లో యువ ఆటగాళ్లు లీగ్‌లో అదరగొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీకి ఇది సెకండ్ ఐపీఎల్ సీజన్. గత ఏడాది రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. తన బ్యాటింగ్‌తోనే కాకుండా డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ల వద్ద టెక్నిక్స్ నేర్చుకోవడంలోనూ ముందు వరుసలో ఉన్నాడు. ముఖ్యంగా జడేజా వంటి దిగ్గజాలు అండగా ఉండటంతో ఈసారి వైభవ్ తన బ్యాట్‌తోనే కాకుండా మానసికంగా కూడా మరింత బలంగా మారే ఛాన్స్ ఉంటుంది. మార్చి 30వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తన ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది. కాగా ఐపీఎల్ 2026 సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, క్వేనా మఫాకా, నాండ్రే బర్గర్, శుభమ్ దూబే లాంటి ఆటగాళ్లు ఈసారి జట్టుకు కీలకంగా మారే ఛాన్స్ కనిపిస్తుంది.
🗡️🆚🥶 pic.twitter.com/02GTC3hCcr
— Rajasthan Royals (@rajasthanroyals) March 19, 2026
